పర్యావరణం కోసం మొక్కలు నాటాలి
NEWS Jul 10,2026 09:25 am
"ప్రకృతి హరిత దీక్ష.. భావి తరాలకు రక్ష" నినాదంతో మోడల్ స్పోర్ట్స్ స్కూల్, కిన్నెరసానిలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. హెచ్‌ఎం ఎన్. చందు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొని పలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం ఎన్. చందు మాట్లాడుతూ, మానవ మనుగడకు మొక్కలు అత్యంత అవసరమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.