అగ్రరాజ్యం అమెరికా తన చారిత్రక 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ మైలురాయిని పురస్కరించుకొని ఫిలడెల్ఫియాలోని ప్రసిద్ధ ఇండిపెండెన్స్ హాల్ వేదికగా నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన మంత్రముగ్ధులను చేసింది. డ్రోన్లు రంగురంగుల వెలుగులతో ఆకాశంలో దేశ చరిత్రను ఆవిష్కరించాయి. వలసవాద కాలం నాటి జీవనశైలి, రెండో ప్రపంచ యుద్ధ పోరాటాలు, పౌర హక్కుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రతిరూపం, చంద్రుడిపై వ్యోమగాములు జాతీయ జెండాను పాతిన చారిత్రక ఘట్టాలను అద్భుతంగా ప్రదర్శించారు.