'నాగబంధం' మూవీ రివ్యూ
NEWS Jul 03,2026 11:14 am
సనాతన ధర్మం, పురాణాల నేపథ్యంలో సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. హిమాలయాల్లో దొరికిన రహస్య పుస్తకం, బ్రహ్మకమలం చుట్టూ తిరిగే కథ. బ్రహ్మాండాన్ని శాసించాలనుకునే విలన్ ముఠాను అడ్డుకునే రుద్ర పోరాటమే ఈకథ. అద్భుతమైన విజువల్స్, VFX , యాక్షన్ సీన్లు బాగున్నాయి. భావోద్వేగాలు లోపించాయి. కథనంలో డ్రామా తక్కువై, విజువల్ హంగుల కోసమే సినిమా తీసినట్లు అనిపిస్తుంది. పాటలు, సాగతీత సీన్లు ఇబ్బంది పెడతాయి. ముగింపు అసంపూర్ణంగా అనిపిస్తుంది. విజువల్ వండర్స్ ఇష్టపడేవారు ఒకసారి చూడొచ్చు.