Logo
Download our app
హైడ్రా పేదల ఇళ్లనే కూలుస్తోంది: హైకోర్టు
NEWS   Jul 02,2026 11:57 pm
చెరువుల ఆక్రమణ, FTL పరిధిలోని అక్రమ నిర్మాణాల నిర్మూలనకు పుట్టుకొచ్చిన హైడ్రా, GHMCతో కలిసి కేవలం పేదల ఇళ్లను మాత్రమే కూల్చుతోందని తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తార్నాకలోని ఎర్రకుంట ఆక్రమణలపై సీనియర్ న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు క్రమక్రమంగా ఆక్రమణలకు గురవుతూనే వస్తుందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, హైడ్రా, లేక్ ప్రొటెక్షన్ కమిటీకి ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని పిటిషనర్ తన వాదనలు పకడ్బందీగా వివరించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం కలుగజేసుకుని.. GHMCసీ, హైడ్రా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాళ్లు కేవలం పేదోళ్ల ఇళ్ల మీదే పడ్డారని, వాళ్ల ఇళ్లను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని కూలుస్తున్నారని వ్యాఖ్యానించింది. ఈ మేరకు GHMCతో పాటు హైడ్రా, నీటి పారుదల శాఖలకు హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source