Netflixలో ‘ది టార్చ్ బేరర్’ డాక్యుమెంటరీ
NEWS Jun 21,2026 11:00 pm
‘బాహుబలి’ ఫ్రాంచైజీకి సంబంధించిన ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ డాక్యుసిరీస్ జూన్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడు రాజమౌళి విజన్‌తో రూపొందిన బాహుబలి ప్రయాణం, తెర వెనుక జరిగిన సాహసాలు, నటీనటుల శ్రమ, VFX, యుద్ధ సన్నివేశాల విశేషాలను ఇందులో చూపిస్తారు. బాహుబలి సాధించిన విజయాలు, బాక్సాఫీస్ రికార్డులు, తెలుగు సినిమాపై చూపిన ప్రభావాన్ని కూడా ఈ సిరీస్‌లో ఆవిష్కరించనున్నారు. ‘సినిమా కంటే భిన్నమైన అనుభూతి అందిస్తాం’ అని మేకర్స్ చెబుతున్నారు.