తెలంగాణకు వచ్చేందుకు.. వెళ్లేందుకు.. పోటీ చేసేందుకు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడినందునే.. పవన్‌పై తమ మంత్రులు మాట్లాడారన్నారు. తనకు హిట్లర్ ఆదర్శం అని తానెప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ఎవరైనా.. హిట్లర్ తమకు ఆదర్శం అని చెబుతారా? అని ప్రశ్నించారు.