హైదరాబాద్‌కు ఐమ్యాక్స్ వచ్చేస్తోంది
NEWS Jun 01,2026 07:43 pm
పుష్కార కాలం తర్వాత హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ స్క్రీన్ మళ్లీ అందుబాటులోకి రానుంది. AMB సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్, IMAX సంయుక్తంగా సుదర్శన్ 70 థియేటర్‌లో ‘ఏఎంబీ క్లాసిక్ విక్టరీ’ పేరుతో ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించాయి. ఇది ట్రూ IMAX (1.43:1) లేదా సాధారణ IMAX (1.90:1) ఫార్మాట్‌లో ఉంటుందా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే డాల్బీ విజన్, EPIQ, 4DX వంటి అత్యాధునిక స్క్రీన్‌లకు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌కు ఐమ్యాక్స్ చేరిక మరింత ప్రత్యేక ఆకర్షణ కానుంది.