ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అన్నదానం
NEWS May 31,2026 11:37 am
హైదరాబాద్‌లోని నీలోఫర్, MNJ ఆస్పత్రుల వద్ద రెడీ టూ సర్వ్ - అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆస్పత్రులకు చికిత్స కోసం వచ్చిన రోగులు, వారి బంధువులు, నిరుపేదలు, అవసరమైన వారికి భోజనం పంపిణీ చేశారు. ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొని వందలాది మందికి ఆహారం అందించారు. ఈ సేవ యజ్ఞంలో పాలుపంచుకునేవారు తమను సంపాదించవచ్చని రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ నిర్వహకులు పెద్దిశంకర్ తెలిపారు.