సీఎం విజయ్ సలహాదారుగా విష్ణురెడ్డి
NEWS May 22,2026 11:41 pm
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌కు సలహాదారులుగా నియమితులైన ఇద్దరిలో ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి సమీప బంధువైన విష్ణురెడ్డి ఉన్నారు. విజయ్‌కు ప్రత్యేక సలహాదారులుగా విష్ణురెడ్డి, జాన్ ఆరోక్యసామిలను తమిళ ప్రభుత్వం నియమించింది. విష్ణురెడ్డి(విష్ణువర్ధన్ రెడ్డి) అన్నమయ్య జిల్లా ఎర్రదొడ్డిపల్లెకు చెందినవారు. గ్రానైట్ వ్యాపారం చేస్తూ చెన్నైలో స్థిరపడ్డారు. విజయ్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు.