ఎస్సీ సర్టిఫికెట్ల రద్దుకు దళితుల డిమాండ్
NEWS Apr 24,2026 09:53 pm
చిలకలదోన గ్రామంలో దాసరి కులస్తులకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వొద్దని దళిత నాయకులు మంత్రాలయం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. దాసరి కులం బీసీ-ఏ వర్గానికి చెందినదని, తప్పుడు విధంగా ఎస్సీ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు, పదవులు పొందుతున్నారని ఆరోపించారు. దీనివల్ల నిజమైన ఎస్సీలకు నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్డీవో విచారణ చేసి నివేదిక పంపినట్లు తెలిపారు. తక్షణమే తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్లను రద్దు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.