మోనాలిసా భోంస్లే తల్లి కాబోతున్నట్లు ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పోలీసులకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. మైనర్‌గా ఉండగానే వివాహం చేసుకున్నందుకు అతనిపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాల్సిన సమయంలో ఆమె గర్భవతిగా ఉండటంతో ప్రయాణం చేయలేకపోతున్నదని ఫర్మాన్ వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె కేరళలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ విషయం నిజమా? లేక కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.