ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని..
తేల్చి చెప్పిన డిప్యూటీ సీఎం పవన్
NEWS Mar 28,2026 04:16 pm
ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అమరావతి ఒక్కటేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని తెలిపారు. వైసీపీ పాలనలో అమరావతిపై కక్ష కట్టారని, 3 రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, రాజధాని కోసం భూములిచ్చిన రైతులను హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.