శ్రీ సీతారాముల పల్లకి ఊరేగింపు
NEWS Mar 28,2026 01:30 pm
నిర్మల్: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలోని వాల్మీకి నగర్ శ్రీ రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాత సాయంత్రం శ్రీ సీతారాముల పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శ్రీ సీతారాములను బాగులవాడ, ఇందిరా నగర్ కాలనీలో ఊరేగించారు. మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున మంగళహారతులతో స్వామివారి పల్లకి యాత్రలో పాల్గొన్నారు. డీజే పాటలతో భక్తి వినిపిస్తూ ఊరేగింపు కొనసాగించారు.