సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం: మోదీ
NEWS Mar 27,2026 09:56 pm
దిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎంలతో నిర్వహించిన వర్చువల్ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. తీర ప్రాంతాలు, సరిహద్దుల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంక్షోభం దృష్ట్యా భద్రతకు విద్రోహ శక్తులు విఘాతం కలిగించే ప్రమాదం ఉందన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.