బీజేపీకి రూ.6,074 కోట్ల విరాళం!
NEWS Mar 27,2026 11:16 am
గతేడాది 6 జాతీయ పార్టీలకు రూ.6,648 కోట్ల విరాళాలు రాగా, అందులో బీజేపీకి రూ.6,074 కోట్లు అందినట్లు ADR తెలిపింది. రూ.20వేలకు మించిన 5,522 చందాల ద్వారా ఈ మొత్తం సమకూరినట్లు తెలిపింది. కాంగ్రెస్, ఆప్, CPM, NPEPలకు రూ.574 కోట్లు వచ్చినట్లు చెప్పింది. రూ.20వేలకు పైబడిన విరాళాలు తమకేమీ రాలేదని BSP ప్రకటించినట్లు వివరించింది. ఈ పార్టీల కంటే 10 రెట్లు ఎక్కువ కమలం పార్టీకే వచ్చాయి.