భద్రాచలంలో సీతారాముల కల్యాణ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం రేవంత్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సీతారాముల కల్యాణానికి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా.. భక్తకోటి మురిసేలా ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.