అంగన్వాడీలను ఒంటిపూట నిర్వహించాలి
NEWS Mar 27,2026 04:21 am
వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు గుగులోత్ హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. 3-5 ఏళ్ల చిన్నారులకు 2 పూటలు నిర్వహించడం సరైంది కాదని తెలిపారు. ఎండల కారణంగా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, వడదెబ్బ ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కేంద్రాల్లో చల్లటి తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.