ఆంజనేయ స్వాములకు సర్పంచ్ బిక్ష
NEWS Mar 26,2026 04:51 pm
కథలాపూర్ మండలం దూలూరు గ్రామంలో ఆంజనేయస్వామి మాల ధరించిన భక్తులకు సర్పంచ్ రజియా బేగం అజీమ్ అన్నప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం భేదం లేకుండా గ్రామ ఐక్యతతో ముందుకు సాగుతామని తెలిపారు. భక్తితో స్వామిని కొలవడం ద్వారా గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. సుమారు వందమంది స్వాములకు ఇంటివద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నాయకుడు శ్రీహరి, అంగన్వాడీ టీచర్లు, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.