బతికి ఉండగానే శ్మశానానికి..
NEWS Mar 21,2026 10:46 am
జగిత్యాల: కిడ్నీలు ఫెయిలైన భర్తకు చికిత్స చేయించలేని నిస్సహాయ స్థితిలో భార్య అతడిని శ్మశానంలో వదిలివెళ్లింది. జగిత్యాలకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్(49)కు కిడ్నీలు దెబ్బతినడంతో ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేయించినా ఫలితం లేకపోయింది. అద్దె ఇల్లు ఖాళీ చేయాలని ఓనర్ ఒత్తిడి, ఇద్దరు పిల్లల బాధ్యతతో శ్రీధర్‌ను భార్య శ్మశానంలో వదిలి పుట్టింటికి వెళ్లింది. స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు.