భద్రాచలం: గోదావరి వద్ద విషాదం
ముగ్గురు మృతదేహాలు లభ్యం
NEWS Mar 20,2026 09:52 pm
భద్రాచలం సమీపంలోని కూనవరం వద్ద గోదావరి నది వద్ద విషాదం. స్నానానికి దిగిన 5గురు ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. అమరావతిలోని SRM కాలేజీకి చెందిన 7గురు ఫ్రెండ్స్ విహారయాత్రకు వచ్చారు. ఇద్దరు స్థానికులు, మిగతావారు ఇతర ప్రాంతాలవారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.