గోదావరిలో 5గురు విద్యార్థులు గల్లంతు..
ముగ్గురి మృతదేహాలు లభ్యం
NEWS Mar 20,2026 09:31 pm
భద్రాచలం సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ఐదుగురు యువకులు ప్రమాదవశాత్తు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ముగ్గురు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మిగిలిన ఇద్దరు యువకుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ఘటనతో విషాద వాతావరణం నెలకొంది.