ఆవు మృతితో రైతు కుటుంబం విషాదం
NEWS Mar 20,2026 05:02 am
చెన్నరావుపేట (మం) ఖాదర్‌పేట గొల్లపల్లిలో రైతు బట్టమేకల రవి తండ్రి మల్లేష్ తన ఆవును నీటి కోసం చెరువుకు తీసుకెళ్లగా, ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. ఆవు మరణంతో ఉగాది పండగ రోజునే కుటుంబ సభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా ఉండే ఆవు చనిపోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చనిపోయిన ఆవు విలువ రూ.60,000కు పైగా ఉంటుందని, తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.