కవిత పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
NEWS Mar 19,2026 10:24 am
కవిత.. ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో నూతన రాజకీయ పార్టీ నమోదు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి జనవరి 23న దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. తన దరఖాస్తును ఈసీ వేగంగా పరిశీలించి నిర్ణయం వెలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దరఖాస్తులో చాలా లోపాలున్నాయంటూ ఆమెకు ఫిబ్రవరి 23నే సమాచారం పంపామని ఈసీఐ తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా దిల్లీ హైకోర్టుకు తెలిపారు. పిటిషన్ గురువారం మరోసారి విచారణకు రానుంది.