బంగారం, వెండి మళ్లీ పెరిగిందిగా..
NEWS Mar 17,2026 01:26 pm
ఇటీవల క్రమంగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు మంగళవారం ఒక్కసారిగా షాకిచ్చాయి. హైదరాబాద్‌లో బంగారం ధర సగటున రూ.1200ల మేర పెరిగింది. 24 క్యారెట్ 10 గ్రా. పసిడి ధర రూ.1,58,620లకు ఎగబాకింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర కూడా రూ.1100ల మేర పెరిగి రూ.1,45,400కు చేరుకుంది. నగరంలో వెండి ధర రూ.4 వేల మేర పెరిగింది. కిలో వెండి ప్రస్తుతం రూ.2.8 లక్షలు పలుకుతోంది.