తాగునీటి పైపులైన్‌లకు నిప్పు
NEWS Mar 16,2026 03:31 pm
బొర్రా పంచాయతీ పరిధిలోని పెద్దూరు గ్రామానికి తాగునీరు అందించే పైపులైన్లను ఆదివారం రాత్రి అగంతకులు నిప్పంటించారు. మంటలతో పైపులైన్లు పూర్తిగా కాలిపోవడంతో గ్రామానికి నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనపై పోలీస్ శాఖ వెంటనే స్పందించి పైపులైన్లకు నిప్పంటించిన సంఘ విద్రోహులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పెద్దూరు గ్రామానికి త్వరగా తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.