గ్యాస్ బుకింగ్‌లో OTP తప్పనిసరి
NEWS Mar 13,2026 10:33 pm
గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పాత నిబంధనను తప్పనిసరిగా చేసింది. గ్యాస్ బుక్ చేసిన తర్వాత సిలిండర్ డెలివరీ సమయంలో OTP తప్పనిసరి చేసింది. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసిన వెంటనే వినియోగదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. డెలివరీ బాయ్ సిలిండర్ ఇవ్వడానికి ముందు ఆ OTPని నమోదు చేయాలి. OTP ధృవీకరణ అయిన తర్వాతే సిలిండర్ అందజేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బుకింగ్ తర్వాత వచ్చే ఓటీపీని భద్రంగా ఉంచుకోవాలి.