TTD లడ్డూ పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
NEWS Mar 13,2026 02:49 pm
తిరుమల లడ్డూ వ్యవహారంపై మానూరు శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ దిశగా CBI దర్యాప్తు చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో జంతువుల కొవ్వు కలిసిందనడానికి మీరేమైనా నిపుణులా? అని CJI జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఏవైనా ఆధారాలుంటే CBIకి ఇవ్వాలని సూచిస్తూ కేసు విచారణను ముగించారు.