ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్
NEWS Mar 10,2026 10:03 pm
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన్ 2.0 కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల వ్యయంతో రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇండ్లను నిర్మించాలన్న ప్రతిపాదలను ఆమోదించింది. కేంద్రం వాటాగా నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం తెలిపారు.