చక్ దే ఇండియా.. మార్మోగిన స్టేడియం!
NEWS Mar 08,2026 11:02 pm
భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకున్న సందర్బంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్, నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం బాణసంచా వెలుగులతో, 'చక్ దే ఇండియా' నినాదాలతో హోరెత్తిపోయింది. కెప్టెన్ సూర్యకుమార్, తన తొలి మేజర్ టోర్నీలోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి రికార్డు సృష్టించాడు. "ఇది జట్టు సమిష్టి కృషి. ఈ కప్పు దేశ ప్రజలందరికీ అంకితం!" అని గెలుపు అనంతరం భావోద్వేగంతో సూర్య వ్యాఖ్యానించాడు.