యుద్ధంతో పెరుగుతున్న ధరలు!
NEWS Mar 07,2026 12:29 pm
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థపై, సామాన్యులపై ప్రభావం చూపే అవకాశముంది. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడంతో వాణిజ్య నౌక రాకపోకలు తగ్గి ఆయిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల దిగుమతులకు అంతరాయం ఏర్పడే పరిస్థితి. వంట నూనెలు, సోయా, సన్‌ఫ్లవర్, పప్పుదినుసుల ధరలు ఇప్పటికే ఎక్కువగా ఉండగా, యుద్ధం కొనసాగితే మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలతో డ్రైఫ్రూట్స్ దిగుమతులు తగ్గి వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశముందంటున్నారు.