సాక్షి మీడియాపై పరువు నష్టం దావా
NEWS Mar 01,2026 02:39 pm
టీటీడీపై అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై సాక్షిలో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్ నోటీసులో తెలిపారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించి క్లారిటీ ఇచ్చారు. మార్ఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని, లీగల్ ఫైట్ చేస్తానన్నారు.