ప్రధాని మోదీని కలిసిన విజయ్-రష్మిక
NEWS Feb 27,2026 01:38 pm
విజయ్ దేవరకొండ, రష్మిక మందనా పెళ్లి ముగిసిన వెంటనే ఈ జంట ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను, ప్రధాని మోదీని కలిశారు. మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. తమ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. మార్చి 4న హైదరాబాద్‌లో విజయ్, రష్మిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తాజ్ కృష్ణలో 4న సా. 7 గంటలకు రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు.