ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్
NEWS Feb 23,2026 10:33 pm
AP రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రాబోయే ఏడాదిన్నరలో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. టెలికాం, టెక్నాలజీ రంగంలో ఎలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టినా.. ఏపీని టెస్ట్‌బెడ్ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు. అమెండెడ్ భారత్‌నెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం కుదిరింది.