పంచాయతీ పాలక వర్గానికి సన్మానం
NEWS Feb 23,2026 01:39 pm
మల్లాపూర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధి కారిణి వాహిని ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఉత్తమ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు గ్రహిత దాసరి ఉమా దేవి, ఎల్.సుమలత పాలకవర్గాన్ని అభినందించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్ మోహన్, సూపర్‌వైజర్లు శకుంతల, టీ. విజయ, ఫార్మసిస్ట్ ఆఫీసర్ మహేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్స్ సుమ, మధులత, ఏఎన్ఎం అంజలి, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.