ప్రజా ఆరోగ్యంపై సర్పంచ్ పర్యవేక్షణ
NEWS Feb 14,2026 10:45 am
లక్ష్మీదేవిపల్లి మండలం సాటివారిగూడెం, చాతకొండ ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రం, ప్రజారోగ్య కేంద్రాన్ని సర్పంచ్ వజ్జ విజయ భాస్కర్ సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందుతున్న పోషకాహారంపై వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రజారోగ్య కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్, గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమర్థవంతంగా సేవలు అందించాలని ఆదేశించారు. శివాని, రజిని, నరేష్, రత్న తదితరులు పాల్గొన్నారు.