భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో నాలుగో డివిజన్ బిజెపి పార్టీ అభ్యర్థి చెరుకు భాగ్యలక్ష్మి 115 ఓట్లతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని, తనపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.