లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా రాస్తారోకో
NEWS Feb 12,2026 09:18 pm
పరవాడ లంకెలపాలెంలో సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, కార్మిక హక్కులను అణిచివేసే లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పని గంటలు పెంపు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి భద్రతా హక్కులు బలహీనపరచడాన్ని విమర్శించారు. కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు.