సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక ప్రదర్శన
NEWS Feb 12,2026 09:19 pm
దేశవ్యాప్త సమ్మె భాగంగా చోడవరం పట్టణంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వివిధ రంగాల కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని జిల్లా అధ్యక్షులు వి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మిక హక్కులను హరిస్తున్నారని విమర్శించారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.