సిట్‌తో అక్రమాల దర్యాప్తు
NEWS Feb 11,2026 05:12 pm
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకనంలో జరిగిన అక్రమాలను కనుగొనేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అదనపు డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేయాలి. జవాబుపత్రాల భద్రత, తారుమారు అంశాలను ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పరిశీలించాలి. మార్చి 16లోపు దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని కోర్టు నిర్దేశించింది.