రేపటి పోలింగ్‌కు భారీ భద్రత: డీజీపీ
NEWS Feb 10,2026 04:35 pm
రేపు (ఫిబ్రవరి 11న) జరిగే మున్సిపల్ ఎన్నికలకు 25 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. పార్టీ బేస్ గా జరుగుతున్న ఎన్నికలు కావడంతో భద్రత పెంచామని చెప్పారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు వేయొచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తి చేస్తామని డీజీపీ స్పష్టం చేశారు.