కాంగ్రెస్ గడపగడప ప్రచారం
NEWS Feb 09,2026 04:08 pm
కొత్తగూడెం పురపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 48వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా. రామచంద్రనాయక్ గెలుపు కోసం గడపగడప ప్రచారం నిర్వహించారు. బాలసాని లక్ష్మీనారాయణతో కలిసి, 48వ డివిజన్ బాధ్యులు లావుడ్య పూర్ణ ఆధ్వర్యంలో జరిగింది. నాయకులు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలకు భరోసా ఇచ్చారు. అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్, ఖదీర్, రాకేష్, భీమా, యాకయ్య, సురేష్, మురళి, రాజేష్, వెంకటేశ్వర రావు, హరీష్‌తో పాటు మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.