తేనేటి విందులో ఎమ్మెల్యే కూనంనేని
NEWS Feb 07,2026 07:45 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 6వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా కూనంనేని సాంబశివరావు ఉప్పుశెట్టి రాహుల్ విజయాన్ని కాంక్షిస్తూ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రోడ్‌షో అనంతరం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాలోత్ రమేష్ (వంట మేస్త్రి) గృహంలో ఏర్పాటు చేసిన తేనేటి విందులో పాల్గొన్నారు. సీపీఐ 6వ వార్డు అభ్యర్థి ఉప్పుశెట్టి రాహుల్, బోడ రాజు తదితరులు పాల్గొన్నారు.