సిల్వర్ స్క్రీన్‌పై తండ్రికూతుళ్ల కాంబోలు
NEWS Feb 07,2026 06:13 pm
సినీ ఇండస్ట్రీలో తండ్రీకొడుకుల కాంబోలు కామన్. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్. 2026లో సినిమా రంగంలో తండ్రీకూతుళ్ల జోరు సాగుతోంది. చిరంజీవి కూతురు సుస్మిత ‘మన శంకర వరప్రసాద్ గారు’తో నిర్మాతగా బ్లాక్ బస్టర్ కొట్టగా, గుణశేఖర్ కుమార్తె నీలిమ ‘యుఫోరియా’ను నిర్మించింది. రవితేజ డాటర్ మోక్షద ‘ఇరుముడి’ నిర్మాణ బాధ్యతలు చూస్తుంటే నటుడు అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య హీరోయిన్‌గా ‘సీతా పయనం’ను తెరకెక్కిస్తున్నారు. ఇక ఒకప్పటి నటుడు రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా హీరోయిన్.