మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
NEWS Feb 07,2026 01:45 pm
బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. కిలో వెండి ధర రూ.20వేల మేర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.1,61,150 పలికింది. ముందురోజు పోలిస్తే రూ.3,150 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,550గా ఉంది. శుక్రవారం కిలో వెండి రూ.2,60,000 పలకగా.. నేడు రూ.2,80,000కు చేరింది.