కాంగ్రెస్ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం
NEWS Feb 05,2026 10:07 pm
నిర్మల్ మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థులు ఇంటింటికి, వాడవాడలా వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన, సంక్షేమ కార్యక్రమాలను ఓటర్లకు గుర్తుచేస్తూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.