సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నిందితులను పట్టుకోవడం సులభం అవుతుందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. మెట్ పల్లి డివిజన్ పరిధిలో గత కొద్దిరోజులుగా దొంగతనాలకు పాల్పడుతున్న 7 గురు దొంగలను, 4 బృందాలుగా ఏర్పడి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 15 తులాల బంగారం 30 తులాల వెండి స్వాధీనం చేసుకునీ నిందితులను రిమాండ్ కు తరలించారు. దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన డివిజన్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.