కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమాల కోసం ఓటేయండి
NEWS Feb 04,2026 02:27 pm
నిర్మల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి అంబాజీ రాథోడ్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఏంబరి రాజేశ్వర్ పిలుపునిచ్చారు. సిద్ధాపూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగించాలంటే అంబాజీ రాథోడ్‌ను ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.