నిర్మల్‌లో బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేతలు
NEWS Feb 03,2026 07:48 pm
నిర్మల్: కాంగ్రెస్ నేత నేరెళ్ల సాయి, బీజేపీ శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. నేరెళ్ల సాయితో పాటు పట్టణానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు, యువకులకు మహేశ్వర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే చేరికలు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి బస్వపురం లక్ష్మీ నర్సయ్య, పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.