OTTలో చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా
NEWS Feb 02,2026 11:29 pm
ఓటీటీలోకి వచ్చి తక్కువ సమయంలోనే సంచలన రికార్డులు సృష్టించిన తెలుగు హారర్ థ్రిల్లర్ చిత్రం శంభాల. ఈ సినిమా ఏకంగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసి OTT ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. గతేడాది చివర్లో థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యకర విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ భారీ వసూళ్లు రాబట్టింది.
జనవరి 21 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైన శంభాల, తొలి 5 రోజుల్లోనే 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేయగా, కేవలం 11 రోజుల్లో 100 మిలియన్ల మార్క్‌ను దాటింది. ఈ విషయాన్ని సంబంధిత ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ హీరోగా నటించగా, అర్చన అయ్యర్ కథానాయికగా కనిపించింది. ఆకాశం నుంచి పడిన ఉల్క కారణంగా గ్రామంలో చోటుచేసుకునే భయానక ఘటనల చుట్టూ సాగే కథ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.