ఇండియా గేట్‌పై ట్రంప్ కామెంట్
NEWS Feb 02,2026 10:43 pm
ఢిల్లీ: ప్రసిద్ధ కట్టడం ఇండియా గేట్ ఫొటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. “ఇది భారతదేశపు సుందరమైన విజయ స్మారకం. మనది మరింత గొప్పగా ఉండబోతోంది” అని కామెంట్ చేశారు. అమెరికా స్వాతంత్ర దినోత్సవ 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వాషింగ్టన్ డీసీలో ‘ఇండిపెండెన్స్ ఆర్చ్’ నిర్మాణంపై ట్రంప్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్‌లో సంభాషించారు. ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.